విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రెండో రోజు జర్మనీలో బిజీబిజీ గా గడిపారు.రాజధాని బెర్లిన్‌లో ప్రధాని మోడీకి జర్మనీ ఛాన్స్‌లర్ మెర్కెల్ ఘనస్వాగతం పలికారు. బెర్లిన్‌లో జర్మనీ దళాల సైనిక వందనాన్ని మోదీ స్వీకరించారు. జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి ఫ్రాంక్ వాల్టర్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారాలపై జరిగేవి కీలకం కానున్నాయి.