దేశ తమకు ఎదురే లేదనుకున్న బీహార్ అసెంబ్లీ ఫలితాలతో బీజేపీ తీవ్రంగా భంగపడింది. దేశ రాజకీయాలలో ఇవి తీవ్రంగా ప్రభావం చూపుతాయని ముందు నుంచి విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అయితే ప్రభావం మాటేమోగానీ, కేబినెట్ లో మాత్రం మార్పులు తప్పవని వార్తలు వినవస్తున్నాయి.
పార్లమెంట్ శీతకాల సమావేశాల తర్వాత మంత్రివర్గం ప్రక్షాళన చేయాలని మోదీ భావిస్తున్నారట. సమావేశాలు ముగిసిన వెంటనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. బీహారులో ప్రచారం చేసిన వారితోపాటు, ముఖ్యంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలు వారి వ్యాఖ్యల మూలంగానే పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని మోదీతోపాటు అధిష్టానం భావిస్తుందట. కనీసం ఐదుగురు మంత్రులకు ఉద్వాసన తప్పదని సమాచారం. శీతకాల సమావేశాలు పూర్తికాగానే పార్టీ బాస్ అమిత్ షాతో మోదీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.