బాలీవుడ్ లో మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఎవరంటే... అమీర్ ఖాన్ అని ఠక్కున చెప్పేస్తాం. మరి ఆర్థిక రంగంలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఎవరని అడిగితే... తలా ఓ పేరు చెబుతాం. అయితే అందరి అంచనాలకు సరిపోయే సమాధానం రావాలంటే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్లాల్సిందే. ఆర్థిక రంగంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ను ప్రధాని మోదీ మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా అభివర్ణించారు. ‘‘ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను కేవలం 3,4 కోణాలు చూపించి రాజన్ వివరిస్తారు. ఆయన నిజంగా మిస్టర్ ఫర్ ఫెక్ట్. గతంలో రాజన్ మంచి టీచర్ అయి ఉంటారు’’ అని మోదీ రాజన్ ప్రతిభను కీర్తించారు.