ఆయన సింహం లాంటోడు... ఎవరైనా అనుసరించాల్సిందే

March 23, 2015 | 12:49 PM | 71 Views
ప్రింట్ కామెంట్
modi_lee_kuan_yew_niharonline

సింగపూర్ తొలి ప్రధాన మంత్రి లీ కువాన్ యూ  సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్లో ఆయన మ్రుతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నాయకులందరిలో సింహంలాంటివారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా లీ కువాన్‌ను అనుసరించాల్సిందేనని మోదీ ట్వీట్ చేశారు. గత కొద్ది కాలంగా న్యూమోనియా కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుముశారు. 1923 సెప్టెంబర్ 16న జన్మించిన ఆయన ఆసియా రాజకీయాల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయనను ఆధునిక సింగపూర్ పితామహుడిగా అక్కడి ప్రజలు పిలుచుకుంటారు. ఆగ్నేయాసియాలోని పలు దేశాలతో ఆయన ఎన్నో మైత్రి సంబంధాలు నెలకొల్పి అన్ని రంగాల్లో సింగపూర్ దూసుకెళ్లేలా కృషిచేశారు. చైనాకు చెందిన ఓ ధనికుల కుటుంబంలో జన్మించిన ఆయన పాఠశాల విద్యాబ్యాసం సింగపూర్‑లో న్యాయ విద్యను బ్రిటన్ లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పూర్తి చేశారు. సామ్యవాద సిద్ధాంతాన్ని నమ్ముకుని రాజకీయాల్లో ముందుకు వెళ్లి సింగపూర్ తొలి ప్రధాని అయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ