కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం

May 16, 2015 | 03:31 PM | 38 Views
ప్రింట్ కామెంట్
modi_at_shaingai_cental_hall_niharonline.jpg

ప్రపంచంలో చైనా, భారత్ లు నిండు చంద్రుడిలా ఓవైపు నిలిస్తే, మిగిలిన దేశాలన్నీ చుక్కల్లా మరోవైపు నిలిచాయని ప్రధాని మోదీ అభివర్ణించారు. షాంగైలో వేలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలవైపు చూస్తున్నాయని తెలిపిన ఆయన భారత్, చైనాలు కలిస్తే తిరుగులేని శక్తిగా మారుతాయని అన్నారు. అభిప్రాయ భేదాలు సర్వసాధారణమని, ఒక ఇంట్లోని అన్నదమ్ములకే భేదాభిప్రాయాలు తప్పడం లేదన్న ఆయన సమీప భవిష్యత్తులో రెండు దేశాలూ ఎన్నో అంశాల్లో పరస్పర సహకారాలు అందించుకోనున్నాయని అన్నారు. మనమంతా కలిస్తే ఇండియాను అతి త్వరలోనే అభివృద్ధిచెందిన దేశంగా చూసుకోవచ్చునని చైనా ఎన్నారైలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రేపు ఆదివారం మీకందరికీ సెలవు అని గుర్తుచేసిన ప్రధాని తాను మాత్రం మంగోలియా వెళ్లి పార్లమెంట్ లో ప్రసంగించనున్నారని సంవత్సర కాలంగా ఒక్క తప్పు కూడా జరగకుండా పాలన కొనసాగిస్తున్నానని తెలిపారు. చైనా పర్యటనలో తనకు లభించిన ఆదరణ మరువలేదని ఆయన చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ