రైతులకు మోదీ సర్కార్ భారీ ప్యాకేజ్

April 08, 2015 | 12:23 PM | 72 Views
ప్రింట్ కామెంట్
modi_huge_package_for_farmers_niharonline

అకాల వర్షాల కారణంగా పంట కోల్పోయిన రైతులకు భారీ ప్యాకేజ్ ఇవ్వాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంట నష్టపోయిన రైతులు గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రద్దుచేయాలని, ఆ డబ్బు డైరక్ట్ గా రైతుల జన ధన్ యోజన ఖాతాల్లో వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దయనీయ పరిస్థితుల్లో ఉన్న రైతులకు తదుపరి పంట కోసం వడ్డీ లేని రుణాలను ప్రకటించాలని కూడా మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గడచిన రబీ సీజన్లో బీహార్, గుజరాత్, హర్యానా, జమ్ము కశ్మీర్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడి వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీటి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆహార ఉత్పత్తుల దిగుబడి సైతం అంచనాల కన్నా 40 లక్షల టన్నులు తగ్గింది. గడిచిన 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనంతగా మార్చిలో వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ