ఏపీ విషయంలో మోదీ ఏంచేయబోతున్నారు?

December 15, 2015 | 02:26 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Modi-about-Andhra-pradesh--huge-package-niharonline

నవ్యాంధ్రప్రదేశ్ కు ఎంతో చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ… ఆపై లైట్ తీస్కున్న విషయం అందరికీ తెలిసిందే. అడపాదడపా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అది అరకోరనే. మరోవైపు ఏపీలో ఎలాగైనా బలపడాలన్న బీజేపీకి ఇది అడ్డంకిగా మారుతుంది. టీడీపీ పొత్తును పక్కన పెట్టి సొంతంగా ఎదగాలన్నదే వారి వ్యూహం. ఈ విషయాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా దగ్గర వ్యక్తం చేశారట. వారిని సముదాయించిన అమిత్ షా…ఏపీకి తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే సమయం అతి దగ్గర్లోనే ఉందని వివరించారట.

జనవరిలో ఏపీకి రాబోతున్న ప్రధాని మోదీ… ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని వరాలు ప్రకటిస్తారని… రీసెంట్ గా ఏపీకి జాతీయ రహదారులు సహా ఇతర ప్రాజెక్టుల కోసం గడ్కరీ రూ.65 వేల కోట్లు కేటాయించడం కూడా బీజేపీ చిత్తశుద్ధికి నిదర్శనమని అమిత్ షా వారికి చెప్పినట్టు సమాచారం. మోదీ ఏపీకి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తరువాత రాష్ట్రంలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలని కావూరి, కన్నా, సోము వీర్రాజు, పురందేశ్వరి వంటి నేతలను అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ బలపడటం పక్కనపెట్టి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే మాత్రం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. బీహార్ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మోదీ ఏపీకి భారీ ప్యాకేజీయే ప్రకటించే ఛాన్స్ ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ