మోదీ షరీఫ్ లు ఏం మాట్లాడుకున్నారంటే...?

July 10, 2015 | 04:29 PM | 13 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_nawaz_sharif_pakisthan_tour_niharonline

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో శుక్రవారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య హాట్ హాట్ గా సంభాషణలు జరిగాయట. ముఖ్యంగా ముంబాయి పేలుళ్ల సూత్రధారులపై చర్యలకు పాకిస్తాన్‌ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని భారత్‌ ఆరోపించింది. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న లఖ్వీ వ్యవహారాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వద్ద ప్రస్తావించారట. ఉగ్రవాదాన్ని అడ్డుకుంటున్నామని షరీఫ్‌ చెప్పగా... సమగ్ర చర్యలు అవసరమని మోదీ కోరారట. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణానికి కృషి చేయాలని మోదీ, షరీఫ్‌ నిర్ణయించుకున్నారట. రష్యా నగరం యుఫాలో ఇద్దరు నేతలు శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వచ్చే సంవత్సరం పాకిస్థాన్ లో జరగబోయే సార్క్ సమావేశానికి షరీఫ్‌ మోదీకి ఆహ్వానం పలకగా, మోదీ అంగీకరించారట. అంతేకాదు అనేక ద్వైపాక్షిక అంశాల్లో పాక్‌ వైఖరిని మోదీ సూటిగానే ప్రస్తావించారు. సీమాంధ్ర ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. లఖ్వీపై పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేస్తామని మోదీకి షరీఫ్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. పాకిస్తాన్‌ సైనికులు సరిహద్దుల్లో నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని మోదీ గుర్తు చేశారు. గురువారం రాత్రి కూడా పాక్‌ సైనికుల కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ చనిపోయిన తర్వాత మృతుల వివరాలను కూడా పాక్‌కు అందించినట్లు సమాచారం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా పాక్‌, చైనా ఆర్థిక కారిడార్‌పై మోదీ అభ్యంతరం చెప్పగా దానికి ఇంకా సమయం ఉందని షరీఫ్‌ సమాధానం ఇచ్చారు. పాక్‌ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వెనుక భారత్‌ హస్తముందన్న షరీఫ్‌ ఆరోపణను మోదీ తోసిపుచ్చారు. సాక్ష్యాధారాలు సమర్పించాలని మోదీ డిమాండ్‌ చేశారు. మొత్తానికి ఇలా ఇరు దేశాల ప్రధానుల సమావేశం హాట్ గా ముగిసినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ