పక్క దేశాల నేతలతో మోదీ మంతనాలు

July 09, 2015 | 03:49 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi_china_president_sharif_niharonline

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యాలో బ్రిక్స్‌ దేశాల సదస్సులో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షిజిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భేటీలో ఇద్దరూ ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు భద్రతపై చర్చించారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనా అధ్యక్షుడితో భేటీ కావటం ఇది ఐదో సారి. రెండు దేశాల సంబంధాలు మెరుగుపడుతున్నాయి అనడానికి ఈ సమావేశాలే నిదర్శనమని మోదీ అన్నారు. అంతేకాదు  ఇవాళే పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో మోదీ భేటీ అవుతారట. షాంఘై సహకార సంస్థల సదస్సులో ఇద్దరూ సమావేశం అవనున్నారు. పాక్‌- భారత దేశాల విదేశాంగ కార్యద ర్శులు కూడా ఈ సందర్భంగా సమావేశమై భద్రతా పరమైన అంశంతోపాటు పలు అంశాలపై చర్చించనున్నారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ