అరుణ్ జైట్లీ బడ్జెట్టు... దేశ అభివృద్ధికి మెట్టు

February 28, 2015 | 04:12 PM | 44 Views
ప్రింట్ కామెంట్
modi_on_jaietly_budget_niharonline

పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల జల్లులు కురిపించారు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పష్టమైన విజన్ తో అభివ్రుద్ధికి సోపానంలా ఉందని ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ... పన్ను విధానాన్ని జైట్లీ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని తెలిపిన ఆయన, పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సమ ప్రాధాన్యం ఇచ్చారని, గ్రుహ, విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలపై దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రాలకు సమప్రాధాన్యం కల్పించటం, నల్లధనంపై చట్టం తేవాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పట్టేవిగా ఉన్నాయని అన్నారు. ఈ బడ్జెట్ దేశప్రగతిని ప్రతిబింబించేలా ఉందని కొనియాడారు. పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేలా పలు కొత్త పథకాలు రూపొందించటంపై హర్షం వ్యక్తంచేశారు. మంచి బడ్జెట్ ను రూపొందించటంతో జైట్లీ క్రుతక్రుత్యులయ్యారని ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ