గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (ఎంఎన్ఆర్ఈజీఏ) పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రాష్ట్రపతి ధన్యవాద ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘నాకు మంచి రాజకీయ పరిజ్ఞానం ఉంది. ఆ పథకాన్ని ఆపొద్దని అది చెబుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వ విఫలతకు నిదర్శనమని నా ఆలోచన విధానం అంటోంది. ఎంఎన్ఆర్ఈజీఏ ఇకపై కూడా కొనసాగుతుంది. దానికి అంతం లేదు. అందుకే ఎలాంటి తప్పుచేయను. అయితే దానికి కొంత విలువ చేర్చటం వల్ల పేదలకు లాభం కలుగుతుంది’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.