ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వరయంలో రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఆయన ట్విట్టర్లో స్పందించారు. రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ ముందుచూపుతో, భవిష్యత్ అవసరాలను తీర్చేలా ఉందని ప్రశంసించారు. ప్రయాణికుల సౌకర్యం, ఇతర లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా పక్కా ప్రణాళికతో స్పష్టమైన విజన్ తో బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రైల్వేలో మొదటిసారి సాంకేతిక పరిజ్నానం, రైల్వేల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇవ్వటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్రుద్ధిరేటు పెరుగుదలకు రైల్వే కీలకమయ్యేందుకు బడ్జెట్ స్పష్టమైన రోడ్ మ్యాప్ ను రూపొందిస్తుందన్నారు. మధ్యతరగతి ప్రజలను ద్రుష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఉందని కితాబిచ్చారు. వేగం పెంచటం, స్థాయి, సేవ, భద్రత అన్నీ ఒకే ట్రాక్ పై తీసుకొస్తుందని మోదీ ట్వీట్ చేశారు.