ప్రతిష్టాత్మక పథకాలు... సవాలక్ష ప్రశ్నలు

June 26, 2015 | 06:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modis_vision_about_smart_cities_project_niharonline

విమర్శలను పక్కనబెట్టి అభివృద్ధే లక్ష్యంగా పనిచేసేందుక మోదీ ప్రభుత్వం అస్సలు తగ్గట్లేదు. ఇందులో భాగంగా మూడు ప్రతిష్టాత్మక పథకాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 100 స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేసేందుకు 'స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌' పథకం, దేశంలోని 500 నగరాల్లో మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు అటల్‌ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవనం 'అమృత్‌' పథకం, 2020 నాటికి నగరాల్లో ఉండే అందరికీ ఇళ్లు లక్ష్యంతో ప్రధానమంత్రి 'ఆవాస్‌యోజన' పథకాన్ని మోదీ ప్రారంభించారు.  రూ.48 వేల కోట్లతో ఎంపిక చేసిన ఈ 100 స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చెయటమే లక్ష్యంగా చేసుకున్నారు ప్రధాని. ఎంపిక చేసిన ఒక్కో స్మార్ట్‌ సిటీకి ఏడాదికి రూ. 100 కోట్ల చొప్పున ఐదేళ్ల వరకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఇంత వరకు బాగానే ఉంది ప్రతిష్టాత్మక పథకాలు కావటంతో లోటుపాట్లు గురించి కూడా ఇప్పుడు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సవాళ్లను అధిగమించి పథకాలను అమలు చేయకపోతే ప్రతిపక్షాలతో పాటు ప్రపంచ దేశాల నుంచి కూడా అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సవాళ్లను అధిగమించి మరీ ఈ సవాళ్లను  ఎదుర్కోవటం మోదీ ప్రభుత్వానికి కత్తిమీద సామే. కానీ, ప్రతిపక్షాలను పక్కనబెడితే ప్రపంచ దేశాలకు సమాధానం చెప్పగల వ్యక్తి ఆయన. అలాగని సమస్యను నాన్చే పని చెయ్యకపోవచ్చు. అన్నట్లు తెలుగు రాష్ర్టాల్లో 5 స్మార్ట్‌సిటీలు, 46 అమృత్‌ పట్టణాలను కేంద్రం ఆధునీకరించనుంది. ఏపీలో 3, తెలంగాణలో 2 స్మార్ట్‌సిటీలు ఎంపికవగా, ఏపీలో 31, తెలంగాణలో 15 అమృత్‌ పట్టణాలను ఎంపిక చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ