భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన ముగించుకుని ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఆదివారం బంగ్లాదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ పాకిస్థాన్ పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్థానే. భారత్ పై ఎన్నో సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది, ఎన్నో వేల మంది ప్రాణాలు తీసింది. అయినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాం. కానీ, భవిష్యత్ లో వీటంన్నింటికి పాకిస్థాన్ ఖచ్ఛితంగా అనుభవించి తీరుతుంది అని ఆయన మాట్లాడారు. 2 వేల మంది సమక్షంలో దాదాపు గంటపాటు జరిగిన ఈ ఉపన్యాసంలో ఆయన పదే పదే పాకిస్థాన్ పేరు ప్రస్తావిస్తూ విరుచుకుపడటంతో సభలో ఆద్యాంతం హర్షాద్వానాలు వెల్లువిరిశాయి. ఇంకోవైపు నకిలీ కరెన్సీ బంగ్లాదేశ్ ద్వారానే ఎక్కువ జరుగుతుందని, ఆ పనిని చేసేది ఒకరయితే(పాకిస్థాన్), అనుభవించేది మరోకరని(బంగ్లాదేశ్) అని మోదీ వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా కొనసాగుతున్న బంగ్లాదేశ్ సరిహద్దు అంశాన్ని భారత్ ఇటీవలె పరిష్కరించిందని తెలిపారు. మరోవైపు తీస్తా వ్యవహారానికి సంబంధించి గాలి, నీరు, నేల కు సరిహద్దులు ఉండవని, తీస్తా వ్యవహారంలో బంగ్లాదేశ్ భారత్ కు సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద బంగ్లాదేశ్ పర్యటన ఇరుదేశాల మధ్య వర్తక వాణిజ్యాలతోపాటు ఎన్నో ఏళ్లుగా నానుతున్న సమస్యలకు పరిష్కారం చూపిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇక మోదీ చేసిన ప్రసంగంపై ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి.