భవిష్యత్ లో రక్షణ రంగంలో వైమానికానిదే కీలక పాత్ర

February 18, 2015 | 10:52 AM | 39 Views
ప్రింట్ కామెంట్
Modi_Aero_India_niharonline

రానున్న పదేళ్లలో వైమానిక రంగంలో దాదాపు 2లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బెంగళూరులో మంగళవారం ఏరో ఇండియా ప్రదర్శనను ప్రారంభించి ఆయన మాట్లాడారు. మేకిన్ ఇండియాలో రక్షణ రంగానిదే కీలక పాత్ర అని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ రక్షణ రంగంలో కూడా ముఖ్యంగా వైమానిక రంగమే ముఖ్యపాత్ర వహించబోతుందని ఆయన చెప్పారు. ఈ ప్రదర్శన భారత రక్షణ రంగ తయారికీ వేదికగా నిలవనుందని కూడా అన్నారు. రక్షణ రంగ కొనుగొళ్లలో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. మరింత అభివ్రుద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు క్రుషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ