సూటు, బూటు ప్రభుత్వమని రాహుల్ గాంధీ చేసిన కామెంట్లకి ప్రతిస్పందించారు దేశ ప్రధాని మోదీ. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం పేదరికంలో మగ్గుతోందని మండిపడ్డారు. అధికారాన్ని కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అన్నారు. పేదల పక్షాన పోరాడే వారే అయితే ఈ అరవై ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్డీయేది, సూటూ, బూటూ ప్రభుత్వమని విమర్శిస్తున్నారని, సూటు కేసుల పాలన కంటే తమ పాలనే మంచిది కదా అని ఎద్దేవా చేశారు. సొంత మనుషులకు బొగ్గు గనులను కట్టబెట్టిన ఘనత కాంగ్రెదని. తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ కు లేదని ఆయన అన్నారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలకు నేరుగా ప్రధాని స్పందించటం ఒక రకంగా రాహుల్ ను హైలెట్ చేసినట్లయ్యిందని కాంగ్రెస్ ప్రతినిధులు గర్వంగా చెప్పుకోవటం కొసమెరుపు.