దేశ ప్రధాని మోదీ సీనియర్ల సలహాలు వినేందుకు ఈ మధ్య బాగా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఆహ్వానించి గంటకు పైగా చర్చించిన మోదీ ఇప్పుడు మరో మాజీ ఛాయ్ ఆహ్వానం పంపారు. ఆయన ఎవరో కాదు జనతా దళ్ (ఎస్ ) అధినేత, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవగౌడ. ఈ విషయాన్ని స్వయంగా దేవగౌడానే వెల్లడించారు. ‘‘ప్రధాని కార్యాలయం నుంచి నా కార్యదర్శికి ఫోన్ వచ్చింది. మోదీ నన్ను కలవాలనుకుంటున్నారట. టీ తాగేందుకు రమ్మని ఆహ్వానించారు’’ అని దేవగౌడ తెలిపారు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేకపోవటంతో జూన్ 3నగానీ, 4నగానీ వెళ్లి ప్రధానిని కలుస్తానని గౌడ తెలిపారు. తమ కలయిక కేవలం మర్యాద పూర్వకమేనని, ఎటువంటి రాజకీయ అజెండా లేదని దేవగౌడ అన్నారు. మొత్తానికి పాలనా పరమైన సలహాలు తీసుకునేందుకు సీనియర్లందరినీ మోదీ వరుసబెట్టి ఆహ్వానిస్తున్నారన్న మాట.