అవును... ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఎందుకనేగా డౌటు. బంగ్లాదేశ్ తో సుదీర్ఘ కాలంగా సాగుతున్న సరిహద్దు వివాదానికి పరిష్కారం చూపే కీలక బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ మద్ధతు తెలిపింది. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా బిల్లుకు మద్ధతు ఇచ్చినందుకు సోనియాకు స్వయంగా మోదీ కృతజ్ణతలు తెలిపారు. సరిహద్దు విషయంలో ఏళ్ల తరబడి నులుగుతున్న రాజ్యాంగ సవరణ బిల్లును ఇరు సభల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమోదం పొందటం హర్షించదగ్గ విషయమని, దీనికి కాంగ్రెస్ అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా ఏ భూభాగంలో ఉన్నమో అర్థంకాని పరిస్థితుల్లో అల్లాడుతున్న వేల మందికి మేలు జరగనుందని మోదీ తెలిపారు. వారు ఒకవేళ ఇక్కడ చేరేందుకు నిరాకరించే పక్షంలో వారిని తిరిగి వెళ్లిపోయేందుకు ప్రభుత్వం అనుమతించటంతోపాటు వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.