ప్రధాని మోదీ వచ్చేవారం చైనాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా అక్కడి ప్రజలను ఆకట్టుకోవాలనుకుంటున్న ఆయన ఆ ప్రయత్నాలను ప్రారంభించారు. తనదైన శైలిలో చైనా భాషల్లో ట్వీట్లు చేయటం ప్రారంభించారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడటానికి ఇదే సరైన తరుణమని ఆయన ట్వీట్ చేశారు. ఆయన తాజాగా చైనా ట్విట్టర్ ఖాతా వైబో లో చేరారు. చేరి చేరగానే చైనీయుల నుంచి విపరీతమైన క్రేజ్ కూడా వచ్చింది. కాగా, ఈ నెల 14 నుంచి మూడురోజులపాటు మూడు దేశాల ఫారిన్ టూర్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే.