నెక్స్ట్ టార్గెట్ రష్యానే!

June 16, 2015 | 01:27 PM | 0 Views
ప్రింట్ కామెంట్
modi_russia_tour_niharonline

వరుస విదేశీ పర్యటనలతో ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకుంటున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మరో దేశంపై కన్నేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో రష్యా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని ఆ దేశంతో సంబంధాలు పెంపొందించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే భారత్, రష్యాల మధ్య ప్రత్యేక సంబంధాలను ఆయన పదేపదే గుర్తుచేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఆ దేశం అధికార దినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఆ దేశానికి అభినందనలు తెలిపారు. అంతటితో ఆగక రానున్న రోజుల్లో ఇరు దేశాలను మరింత సన్నిహితం చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాల ఆవశ్యకత భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఆయన ఇంగ్లీష్ తోపాటు రష్యన్ భాషల్లో కూడా ట్వీట్ చేశారు. రష్యాల మధ్య కాల పరీక్షలో నెగ్గిన ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని, ఇరు దేశాల ప్రజల మధ్య గల పటిష్ఠమైన పరస్పర స్నేహ, సహాయ సహకారాల వల్లే ఇది సాధ్యమయిందని ఆయన పేర్కొన్నారు. ఇక అసలు విషయమేంటంటే మోదీ వచ్చే నెలలో రష్యాలో పర్యటించనున్నారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా), షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన రష్యా వెళ్తున్నారు. మోదీ తన రష్యా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పర్యటనకు ముందే ఆ దేశంతో మైత్రిని మరింత బలపరచాలని మోదీ భావిస్తున్నారు. మరి మోదీ మేనియాతో రష్యా నుంచి భారీ ఆఫర్లు ఎలా రాబోతున్నాయో వేచిచూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ