ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపిన నేత

January 07, 2016 | 03:15 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-condolence-to-mufti-syeed-death-niharonline

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్(79) మృతి ఒక్క ఆ రాష్ట్రానికే కాదని, మొత్తం భారత జాతికి తీరని లోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు ముఫ్తీ మృతికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

                             ముఫ్తీ మహ్మద్ సయీద్ ఆత్మకు శాంతి కలుగుగాక. ప్రజల జీవితాలపై ముఫ్తీ నాయకత్వం చాలా ప్రభావం చూపింది. అతని నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా ఏదీ నిలబడదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. జమ్ముకశ్మీర్ అశాంతికి తన నాయకత్వంలో ఉపశమన చర్యలు చేపట్టి ముందుకు తీసుకువెళ్లారు. మనల్నందరినీ వదిలివెళ్లాడు. ముఫ్తీ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు నా హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నా అని ట్విట్టర్లో మోదీ పేర్కోన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ