మే లో మోదీ విదేశీటూర్లు ఇవే...

May 05, 2015 | 11:15 AM | 50 Views
ప్రింట్ కామెంట్
modi_foreign_tours_began_from_may_14_niharonline

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాదిలో మరోసారి విదేశీ పర్యటనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా వరుసగా మూడు దేశాల్లో పర్యటన ఉంటుంది. ముందుగా ఈనెల 14 నుంచి 16 వరకు చైనాలో పర్యటిస్తారు. అందులో భాగంగా జియాన్, బీజింగ్, షాంఘైలలో మోదీ పర్యటన ఉంటుంది.  అటునుంచి 17 న మంగోలియా వెళ్తారు. ఓ భారత ప్రధాని మంగోలియా పర్యటించటం ఇదే తొలిసారి. ఆపై 18, 19 తేదీల్లో దక్షిణ కొరియాలో ప్రధాని పర్యటన ఉంటుంది. ఆ దేశాలతో భారత్ సంబంధాలు, పలు అంశాలపై ప్రధాని చర్చిస్తారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ