మోదీ మాస్టర్ ప్లాన్ మహా బాగుంది

June 02, 2015 | 06:09 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi_gadkari_big_plans_to_water_transportation_niharonline

దేశంలోని 101 నదులను అనుసంధానించటం ద్వారా నదీ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయటంతోపాటు 1.100 ద్వీపాలను నిర్మించి టూరిజానికి పెద్ద పీట వేయాలన్నదే దేశ ప్రధాని మోదీ లక్ష్యమని రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 300 లైట్ హౌస్ లను నిర్మించాలని కూడా మోదీ కృత నిశ్చయంతో ఉన్నారట. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.50 వేల కోట్లను వెచ్చించనున్నామని, అంతకుముందు 101 నదుల మధ్య జలమార్గాల ఏర్పాటుకు పార్లమెంటు అనుమతి పొందాల్సి ఉందని గడ్కరీ వివరించారు. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ విషయమై చర్చించారని తెలిపారు. అలాగే ఇండియా బంగ్లాదేశ్ మధ్య రవాణా మార్గాల సదుపాయాల కోసం ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. పీపీపీ పబ్లిక్ ప్రైవేయిట్ భాగస్వామ్యంలో జలమార్గాలను అభివృద్ధి చేసేందుకు మోదీ భారీ ప్రణాళికలు రచించినట్లు ఈ ప్రణాళిక ద్వారా అర్థమౌతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ