పఠాన్ కోట్ దాడిపై పరామర్శల వెల్లువ

January 05, 2016 | 12:49 PM | 3 Views
ప్రింట్ కామెంట్
various-country-heads-phone-to-Narendra-Modi-pathankot-attack-niharonline

పఠాన్ కోట్ ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తోంది. పలు దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి విషయంపై ఆరాతీస్తున్నారు. అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఉగ్రదాడిలో మృతి చెందిన సైనిక సిబ్బందికి సంతాపం ప్రకటించారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ లోని మజార్-ఐ-షరీఫ్ నగరంలో భారత రాయబార కార్యాలయంపై ఉగ్రదాడి ఘటనపై మోదీ ఆరాతీశారు. ఘటన జరిగిన తీరు, తీవ్రవాదులను భద్రతా సిబ్బంది అడ్డుకున్న విధానం మోదీకి ఘనీ వివరించగా, పఠాన్ కోట్ దాడిని ఘనీకి మోదీ వివరించారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కూడా దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి గురించి తమకు ఆలస్యంగా తెలిసిందని, సైనికుల మృతికి విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన మోదీతో అన్నారు. ఇంకోవైపు పలు దేశాల అధ్యక్షులు, ముఖ్యనేతలు, ఐరాస శాంతి విభాగ అధిపతులు మోదీకి ఫోన్ చేసి దాడి గురించి పరామర్శిస్తున్నారు.   కాగా, పఠాన్ కోట్ ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృత్యువాత పడగా, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు భారీ ఎత్తున గాలింపు చేపట్టిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ