గత వారం రోజులుగా జమ్ముకశ్మీర్ లో వరదలు భీభత్సం స్రుష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక వీటిపై నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యే సమీక్ష నిర్వహిస్తున్నారు. వరదలతో అతలాకుతలమౌతున్న రాష్ట్రంలో సహాయ చర్యలను పర్యవేక్షించేందుకై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ని ఆదేశించారు. స్వయంగా మంత్రియే శ్రీనగర్ వెళ్లి మరీ పరిస్థితి పర్యవేక్షించాలని ప్రధాని కోరారు. గత వారం రోజులుగా కురుస్తున్నవర్షాలతో జీలం నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో వరద పోటెత్తడంతో వరద పరిస్థితిని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ప్రస్తుతానికి వర్షం ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికి అధికారులంటున్నారు. కొన్నిచోట్ల వదరపోటెత్తినప్పటికీ, తొందరలోనే తగ్గుముఖం పట్టొచ్చని రాష్ట్ర మంత్రి అబ్దుల్ మాజిద్ పడార్ ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాలతో జమ్ము కాశ్మీర్ హైవే పై గత మూడురోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఏప్రిల్ మూడవతేదీవరకు వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా అధికారులు ఇప్పటికే ఆదేశించారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలతో అప్రమత్తంగా ఉన్నామని వారు ప్రకటించారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు ఇప్పటికే తరలివెళ్ళిన సంగతి తెలిసిందే.