తేజ్ చల్... జనరల్ మోదీ

August 03, 2015 | 05:04 PM | 4 Views
ప్రింట్ కామెంట్
PM_narendra_modi_NCC_cadre_niharonline

పిన్న వయస్సులో దేశంపట్ల అంకితభావం, నిజాయితీ, ధైర్యం, సాహసం మొదలయిన వీరోచిత లక్షణాలు అలవడాలని బడి చదువుల రోజుల్లో జూనియర్ ఎన్ సీసీ, కాలేజీ టైంలో సీనియర్ ఎన్ సీసీలను నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాటుచేయడం జరిగింది.

                           ప్రస్తుత రక్షణ మంత్రి పారికర్, సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్, సుష్మాస్వరాజ్, కిరణ్ బేడీ, అమితాబచన్ భార్య జయ వీరందరూ ఎన్ సీసీ కేడెట్లు అయినందుకు తనకు బహుత్ ఖుషీ హై, భాయి యో ఔర్ బెహనో అని నరేంద్ర మోదీ ఎన్ సీసీకి సంబంధించిన కార్యక్రమంలో తన యాభై రెండు అంగుళాల ఛాతీ ఉప్పొంగించేడు. అంతటితో ఆగలేదు. ఢిల్లీలో రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా జరిగే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ది బెస్ట్ కేడెట్ లను ఎంపిక చేసి పెరేడ్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంటారు. అలాంటి అవకాశం కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తాను ఒక కేడెట్ నయిన్పటికీ ఏనాడూ సెలెక్ట్ కాలేదని మోదీ వినమ్రంగా చెప్పడంతో సభికులు ఉద్వేగభరితులయి ఉండవచ్చు.

అదేరంగంలో రాణించి ఏ సైనికాధికారో మోదీ అయిపోయి ఉంటే, ప్రస్తుతం సైనిక వందనం స్వీకరించే స్థానంలో బదులు పదిమందితోబాటు శాల్యూట్ కొట్టుకుంటూ కవాతుచేసే చిత్రం మనకు గోచరించును. గాడ్ ఈజ్ గ్రేట్!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ