గురువారం (మే 28) స్వాతంత్ర్య సమర యోధుడు వీర సావర్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని దేశ ప్రధాని మోదీ ట్విట్టర్లో నివాళులర్పించారు. ఆయన ధీరోదాత్తతకు , దేశానికి అందించిన సేవలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. భారత్ పట్ల ఆయనకున్న ప్రేమ ఆయనను తన మాతృభూమికి జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి పురిగొల్పిందని పేర్కొన్నారు. స్వతంత్ర్య పోరాటంలో చేరేందుకు అనేక మందికి ఆయన ప్రేరణ గా నిలిచాడని మోదీ కొనియాడారు.