ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైనట్లు పీఎంఓ నుండి నవ్యాంధ్రప్రదేశ్ అధికారులకు సమాచారం చేరింది. అక్టోబర్ 22 22వ తేదీన ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన అంగరంగ వైభవంగా జరగనుంది. అంతేకాదు అమరావతి శంకుస్థాపన ప్రాంగణం సాంస్కృతిక కార్యక్రామాలతో హోరెత్తనుంది.
నరేంద్ర మోదీ విజయదశమి రోజు మధ్యాహ్నానికి శంకుస్థాపన చేసే ప్రాంతానికి చేరుకుని అమరావతి గ్యాలరీ సందర్శన తరువాత శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.
మా తెలుగుతల్లి గీతం ఆలాపనతో ప్రదానిని వేదిక మీదికి ఆహ్వానించడం జరుగుతంది. ఆతర్వాత 1.45 నిమిషాల వరకు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ, ఆ తర్వాత బయలుదేరి తిరుమల వెళ్లడం జరుగుతుంది. ఆ తరువాత సాయంత్రం 6.15 వరకు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు.