ధనం, అధికారం సహా సర్వం వదులుకోవాలంటే ఎంతో ధైర్యం, నిబద్ధత కావాలని దేశ ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. సర్వం వదులుకుని బుద్ధుడు మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచాడని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని తల్కతోరా మైదానంలో జరిగిన బుద్ధపూర్ణిమ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... బుద్ధుడు పుట్టిన నేపాల్ ప్రస్తుతం కష్టాల్లో ఉందని, ఇది వారికి అండగా నిలవాల్సిన సమయమని ఆయన పేర్కొన్నారు. బుద్ధుడు లేకపోతే 21 వ శతాబ్ధం మనది కాదని, ఆయన జన్మించిన కారణంగా 21 వ శతాబ్ధం ఆసియాదైందని మోదీ చెప్పారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కావాలంటే బుద్ధుని మార్గమే అనుసరించాలని ఆయన సూచించారు.