దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆడ పిల్లల అభివృద్ధే ద్యేయంగా ప్రవేశపెట్టిన పథకం బేటీ బచావ్... బేటీ పడావ్... ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. అంతేకాదు దీనికి మద్ధతుగా ప్రతి తండ్రి తన కుమార్తెతో సెల్ఫీ దిగాలని మోదీ సూచించారు. ఆ పిలుపునకు దేశంలో చాలా మంది స్పందించి తమ తమ కుమార్తెలతో సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ లిస్టులో ఓ సెలబ్రిటీ చేరారు. అలాంటి ఇలాంటి సెలబ్రిటీ కాదు మరి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన కుమార్తె సారాతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశాడీ క్రికెట్ ఐకాన్. ఇదే క్యూలో మరికొంత సెలబ్రిటీలు క్లిక్ మనిపిచ్చేందుకు రెడీగా ఉన్నారుట.