వైఎస్సార్సీపీలో వణుకు పుట్టిస్తున్న స్టేట్ మెంట్

April 23, 2016 | 10:37 AM | 2 Views
ప్రింట్ కామెంట్
25_more_YSRCP_MLAs_ready_to_jump_niharonline

తెలంగాణలో టీడీపీ క్లీన్ స్వీప్ అయ్యాక ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీలోకి చేరిపోయిన విషయం తెలిసిందే. దీంతో  విపక్ష వైసీపీ తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది. సమీప భవిష్యత్తులో ఈ చేరికలు మరిన్ని ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శనివారం అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆయన మరికాసేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో ఆయన భేటీ కానున్నారు. వెనువెంటనే ఆయన టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.

                                    ఈ క్రమంలో టీడీపీ నేతలు మరో ప్రచారాస్త్రాన్ని విసిరారు. ఇంకా 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, అంతేకాదు వారితో తాము జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయని కూడా చెబుతున్నారు. ఈ స్టేట్ మెంట్ తో వైసీపీలోని మిగతా నేతల్లో కాస్త గుబులు మొదలైంది. అయితే తేదేపా ఆడే మైండ్ గేమ్ మిగతావారిపై పని చేయదని ఓ కీలకనేత వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ