కేసీఆర్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు

April 22, 2016 | 12:10 PM | 2 Views
ప్రింట్ కామెంట్
KCR-at-gauthamiputra-shatakarni-opening-NTR-niharonline

తాను ఎప్పటికీ ఎన్టీఆర్ వీరాభిమానేనని  మరోసారి ప్రకటించారు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.  బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి  ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ ను పదేపదే గుర్తు చేసుకున్నారు. మదరాసీలుగా పిలవబడుతున్న వారిని తెలుగువారుగా మార్చిన ఘనత ఆయనదేనని అన్నారు. "మా నాయకుడు ఎన్టీ రామారావు గారు. తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ. అని నొక్కి మరీ చెప్పారు. గతంలో ఎన్నోసార్లు టీడీపీపై విరుచుకుపడిన కేసీఆర్ ఎక్కడా ఎన్టీఆర్ గురించి పన్నెత్తి మాట అన్నది లేదు. శంషాబాద్ విమానాశ్రయం పేరు ఎన్టీఆర్ గా మార్చేందుకు ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా అందరూ వ్యతిరేకించగా, కేసీఆర్ మాత్రం కినుక వహించారు. ఎన్టీఆర్ మీద అభిమానంతోనే అప్పుడు ఆయన సైలెంట్ అయ్యాడని విశ్లేషకులు కూడా చెప్పుకొచ్చారు. ఒకానోక టైంలో అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు కన్నా కేసీఆర్ పరోక్షంగా చాలాసార్లు ఎన్టీఆర్ పట్ల తన స్వామి భక్తిని అమితంగా ప్రదర్శించారన్నది వారి వాదన కూడా.

                              ఇక ఇఫ్పుడు ఎన్టీఆర్ మీద అభిమానంతోనే చిత్ర ఓపెనింగ్ కి వచ్చినట్లు క్లియర్ గా చెప్పారు కేసీఆర్. అంతేకాదు నెక్లెస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్ అలాగే నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు ఇటీవల అంబేద్కర్ గారి విగ్రహం పెడుతుంటే, కొంతమంది గిట్టనివాళ్లు దుష్ర్పచారం చేశారు. హైదరాబాద్ లో ఉన్నటు వంటి ఎన్టీఆర్ గార్డెన్స్ ఏదైతే ఉందో, అది చిరస్థాయిగా ఎన్టీఆర్ గార్డెన్స్ గానే ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు పోయినా ఎన్టీఆర్ గారు తెలియని వారు లేరు. కాబట్టి అంత మహా నాయకుడు, అంతటి గొప్ప వ్యక్తి స్మారక చిహ్నం ఏదైనా గుండెల్లో పెట్టుకు చూసుకుంటాం. వారి కొడుకుగా బాలకృష్ణ గారి 100వ చిత్రం అన్ని విధాలుగా విజయవంతం కావాలని, వచ్చిన పెద్దలు కూడా ఆశీస్సులు అందించాలి" అంటూ తనదైన శైలి ప్రసంగంతో ఆకట్టుకోవటంతోపాటు హైలెట్ కూడా అయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ