తమ పార్టీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆప్ రక్షణ చర్యను ప్రారంభించింది. కాంగ్రెస్, బీజేపీలతోపాటు తమ పార్టీకి వచ్చే నిధులపై దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక విచారణ సంస్థ (సిట్) తో విచారణ జరిపించాలని సుప్రీంను కోరనుందని సమాచారం. పార్టీకి వచ్చిన నిధులన్నీ బోగస్ అని, పన్ను ఎగవేయడానికి పుస్తకాల్లో నకిలీ ఎంట్రీలు చేశారంటూ ఆప్ వాలంటీర్ యాక్షన్ మంచ్ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో దర్యాప్తు చేయాలని ఆప్ స్వయంగా డిమాండ్ చేస్తుంది. గత ఢిల్లీ ఎన్నికల సమయంలో కూడా ఆప్ అధినేత క్రేజీవాల్ బోగస్ కంపెనీల తరపు నుంచి నిధులు వసూలు చేశారని బీజేపీ ఆరోపణలు చేసింది. దీనిపై ఆప్ స్పందిస్తూ బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని విచారణ చేపడితే ఎవరు ఎన్నారైల నుంచి నిధులు సేకరిస్తున్నారో బయటపడుతుందని చెబుతోంది.