సర్వేలన్నీ కమలానికే... మరీ ప్రజల మద్ధతు?

February 02, 2015 | 05:29 PM | 28 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ పీఠంపై ఉత్కంఠ రోజురోజుకీ పెరిగిపోతుంది. అధికారాన్ని హస్తగతం చేసేందుకు ఆప్, బీజేపీలు పోటాపోటీపడుతూ శాయశక్తులా శ్రమిస్తున్నాయి. ప్రజలు ఏ పార్టీకి పగ్గాలు అప్పజేప్పుతారోనన్న టెన్షన్ తీవ్రమౌతోంది. ఏ పార్టీకి ఓటరు అధికారం కట్టబెడతాడన్న విషయాన్ని తేల్చేందుకు ది వీక్ ఐఎంఆర్బీ సర్వే నిర్వహించింది. మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ 36 సీట్లను గెలుచుకోని ప్రభుత్వం ఏర్పటుచేస్తుందని ఈ సర్వేలో స్పష్టమైంది. ఆప్ 29 స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది. ఇక కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలని 40 శాతం మంది ఓటర్లు కోరుకోగా, కిరణ్ బేడీ సీఎం కావాలని 39 శాతం మంది కోరుకుంటున్నారట. ఇక ఇండియా టీవీ సీఓటర్ నిర్వహించిన మరో సర్వేలో బీజేపీకి 37, ఆప్ కు 28 వస్తాయని తేలిందట. ఇక ఈ సర్వేల ద్వారా ప్రజల్లో బీజేపీ గాలి ఉందని చెప్పుకునేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందని ఆప్ విమర్శిస్తోంది. సర్వేలో ఏం తేలినా అధికారం ఎవరికి కట్టబెట్టాలో ప్రజలకు బాగా తెలుసని ఆప్ చెబుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ