ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఒక మహిళా ఓటరుకు ముత్యాల నెక్లెస్ ఇస్తూ ఆమె కనిపించారు. ఆమె ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తూర్పు ఢిల్లీలోని ప్రతాప్ గంజ్ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. వారు ప్రత్యక్షంగా నెక్లెస్ ఇస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతోంది అని ఆప్ నేత మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. కాగా ఇతర పార్టీలు ఇచ్చే బహుమతులను తీసుకోని, ఓటు మాత్రం తమకే వేయాలని కేజ్రీవాల్ అనడాన్ని ఈసీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే.