వివాదాస్పదమవుతున్న విదేశాంగ కార్యదర్శి మార్పు

January 29, 2015 | 05:33 PM | 35 Views
ప్రింట్ కామెంట్

భారత విదేశాంగ శాఖ నూతన కార్యదర్శిగా జైశంకర్ నియమితులయ్యారు. నిన్నటివరకు ఈ పదవిలో ఉన్న సుజాతా సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ నియమకాల కమిటీతో ఒకరోజు ముందుగానే సమావేశమైన ప్రధాని ఆకస్మాత్తుగా శంకర్ పేరును ఖరారు చేశారు. అయితే, సుజాతా సింగ్ పదవీకాలం ముగియకుండానే కేంద్ర ప్రభుత్వం శంకర్ ను నియమించటం పట్ల తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికిప్పుడు శంకర్ కి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. నిజానికి యూపీఏ హయాంలోనే జైశంకర్ ను నియామించాల్సి ఉందట. కానీ దానికి అధినేత్రి అభ్యంతరం చెప్పటంతో సుజాతా సింగ్ ను నియమించారట. ఇక ఇప్పుడు ఈ నియామకం గురించి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కు కూడా తెలికపోవటం కోసమెరుపు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ