గ్రేట్... నియోజకవర్గ మంచి కోసం మంత్రి పదవి వద్దట

February 13, 2015 | 05:46 PM | 21 Views
ప్రింట్ కామెంట్
somanth_said_bharathi_no_for_cabinet_niharonline

ఎన్నికల్లో గెలిచారంటే చాలు పదవుల కోసం పాకులాడే నాయకులున్న ఈ కాలంలో ఆయన గారు అవకాశం వచ్చిన మంత్రి పదవిని వద్దంటున్నారు. ఆయన ఎవరో కాదు ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్ నేత సోమనాథ్ భారతి. శనివారం కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారనంతరం చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణ ఆరుగురికి చోటు దక్కింది. వారిలో సోమ్ నాథ్ భారతి కూడా ఉన్నారు. అయితే, నియోజక వర్గ అభివ్రుద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంపైనే ద్రుష్టి కేంద్రీకరిస్తానని పేర్కొంటూ మంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించారు. ఇష్టపూర్వకంగానే తాను కేబినెట్ లో చేరదలుచుకోలేదని తేల్చిచెప్పారు. కాగా, ఈ నిర్ణయంపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో హర్షం వ్యక్తంచేశాడు. అన్నట్టు సోమ్ నాథ్ భారతి ఆప్ గత కేబినెట్ లో మంత్రిగా పనిచేశారులేండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ