కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రవర్తిస్తున్నాడంటూ బీహార్ సీఎం జితన్ రాం మాంఝీపై జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలపై మాంఝీ కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘నేనేం కీలుబోమ్మని కాను. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. అసలు నేను బీజేపీ చెప్పినట్లు ఆడట్లేదు. నితీశ్ అలా ఆలోచించకుండా ఉండాల్సింది. తప్పు చేశానని నిరూపిస్తే వైదొలుగుతా’’ అని మాంఝీ స్పష్టం చేశారు. జేడీ(యూ) నేతలు నితీశ్ ను శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నప్పటికీ కోర్టు స్టే ఇవ్వడంతో పాటు, బలనిరూపణ చేసుకునేందుకు మాంఝీకి గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠీ అవకాశమిచ్చారు. దీంతో అసహనానికి లోనైన నితీశ్ మాంఝీతో పాటు గవర్నర్ పైన కూడా విమర్శలు చేశారు. ఈ విమర్శలపై గవర్నర్ స్పందిస్తూ... గడువు ఇవ్వటం అనేది రాజ్యాంగంలో పేర్కొన్న అంశం. దీనిపై నితీశ్ అనవసర విమర్శలు చేయటం తగదని చెప్పారు.