ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ నేత కుమార్ విశ్వాస్ ‘అక్రమ సంబంధం’ నడుపుతున్నాడంటూ, దీనిపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ మహిళా కమిషన్ సమన్లు జారీచేసింది. విశ్వాస్ కు తనతో సంబంధం ఉందని వచ్చిన ఆరోపణలపై నోరు మెదపటం లేదని మహిళా కార్యకర్త ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసినా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదని ఆమె అన్నారు. ఈ తరహా ఆరోపణలు పెరగటంతో తన భర్త వదిలేసి వెళ్లాడని తెలిపారు. ఈ ఆరోపణలను విశ్వాస్ కనీసం ఖండించటం కూడా లేదని ఆరోపించారు. కాగా, ఆ యువతి పోలీసు కమిషనర్ కు లేఖ రాసిందని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ తెలిపారు. అందువల్లే కుమార్ విశ్వాస్, ఆయన భార్యకు నోటీసులు పంపి మంగళవారం కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఇవ్వాలని ఆదేశించినట్లు వివరించారు. ఆరోపణలపై కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ హ... హ... హ... చేతగాక నీచత్వాన్ని నమ్ముకున్నారు అని ట్వీట్ చేశారు.