ఇద్దరు తెలుగు సీఎంలు మాటలకేం తక్కువకాదు. మొన్నామధ్య టీడీపీయే లేకపోతే కేసీఆర్ సిద్ధిపేటలో గొర్రెలు కాసుకునేవాడని చంద్రబాబు ఘాటైన పదజాలంతో చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎంకు హైదరాబాద్ లో ఏంపని అని టీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా చంద్రబాబు కాస్త గట్టిగా స్పందించారు. అయితే కామ్ గా ఉంటే అయిన కేసీఆర్ ఎలా అవుతారు. అందుకే తన రెగ్యులర్ పంథాను పక్కన బెట్టి కాస్త సాఫ్ట్ గానే బాబుకు పంచ్ లు వేశారు. నాగార్జున సాగర్ లో కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహాణలో భాగంగా కేసీఆర్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. చంద్రబాబు మానస పుత్రిక విజన్ 20 20 ను తయారుచేసింది కేసీఆరేనట. విజన్ కు సంబంధించిన డ్రాప్ట్ ను తయారుచేసి ప్లానింగ్ కమిషన్ సభ్యుడు సీహెచ్ హనుమంతరావుకు చూపించి అనేక మార్పులు చేర్పులు చేయించానని,. ఈ విజన్ రూపకల్పన నుంచి నాటి నేతలంతా పారిపోయినప్పటికీ తాను పట్టుబట్టి పూర్తిచేశానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల కూడా అక్కడి నుంచి పారిపోయారని చెప్పుకొచ్చారు. తాను హనుమంతరావు దగ్గరికి వెళ్లి డ్రాప్ట్ చూపిస్తే ఇంత తక్కువ వయసులో ఎంతో అనుభవంతో కూడిన విజన్ ను రూపొందించిన గొప్పోడివి చంద్రశేఖర్ నువ్వు అని ఆయన కీర్తించారని కేసీఆర్ చెప్పారు. ఈ విధంగా చంద్రబాబుకు గుచ్చకుండానే గాలి తీసిపడేశారన్న మాట టీ సీఎం కేసీఆర్ గారు...