ఎగ్జిట్ పోల్ అంచనాలను తారుమారు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ నేత్రుత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటి దాకా వెలువడిన ఫలితాలలో మొత్తం 70 దాదాపు 62 సీట్లలో అధిక్యం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతోంది. ఇక ఆప్ ప్రభంజనానికి బీజేపీ సింగిల్ డిజిట్ (7) కు పరిమితం కాగా, ఒక్క స్థానంలో ఇతరులు ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఇక్కడ రిక్త హస్తం మిగిలే ప్రమాదం లేకపోలేదు. తాజా సమాచారం ప్రకారం ప్రధాని మోదీ ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు సమాచారం. త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన కేజ్రీతో చెప్పారట. ఇక కౌటింగ్ లో బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ, రాష్ర్టపతి కుమార్తె షర్మిష్టలు వెనుకంజలో ఉన్నారు.