ఏబీఎన్ కేసీఆర్ ను ఓ ఆటాడుకుంటుందా?

November 05, 2015 | 03:45 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Vemuri-Radhakrishna-showing-stars-to-KCR-ABN-retelecast-niharonline

ఓరుగల్లు ఉపఎన్నికల నగరా మోగిన సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఓ తీర్పు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా నిషేధం ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ను తిరిగి ప్రారంభించాల్సిందిగా సుప్రీంకోర్టు టీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఎంఎస్ వోలు ఇప్పుడు ఖచ్ఛితంగా ఆ చానెల్ ప్రసారాలను పునరుద్ధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గులాబీ బాస్ కు చేదు గుళిక లాంటిదే.   

పాలనా కొలమానికంగా భావిస్తున్న వరంగల్ ఎన్నికల సమయంలో ఏబీఎన్ ప్రసారాలు కావటం కేసీఆర్ కు పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రాలో, డిజిటల్ సెటప్ బాక్స్ లో ప్రసారమవుతున్న ఆ చానెల్ లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ రేంజ్ లో ఉతికి ఆరేస్తున్నారో మనకు తెలియందీ కాదు. అలాంటిది ఇక్కడ కూడా దానికి క్లియరెన్స్ దొరికితే వదులుతుందా చెప్పండి. ఇన్నాళ్లు ఎంఎస్ వోల వంకతో తప్పించుకుంటూ వస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి స్వయానా సుప్రీంకోర్టే దగ్గరుండి మరీ రాష్ట్ర వ్యాప్తంగా చానెల్ ను పునరుద్ధరించాలని ఆదేశించటంతోపాటు కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో తెలంగాణ సర్కార్ ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది.

మీడియాపై ఉక్కుపాదం అంటూ ఇప్పటికే 508 రోజులపాటు అంటూ కేసీఆర్ అండ్ కోను ఏకీపారేస్తున్న ఏబీఎన్ కి ఇప్పుడు డైరక్ట్ గా ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం దొరికింది. మరి ఇలాంటి సమయంలో ఆ చానెల్ ఎండీ రాధాకృష్ణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చుక్కలు చూపకుండా వదలే ప్రసక్తేలేదని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. పొలిటికల్ తమాషా ఇప్పుడే ఆరంభమౌతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ