మాజీ భద్రతా సలహాదారుపై చెప్పుదాడి

November 05, 2015 | 11:54 AM | 1 Views
ప్రింట్ కామెంట్
m-k-narayanan-slipper-attacked-in-chennai-niharonline

తమిళ అతివాదుల సెగ జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్ కు తాకింది. చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనపై చెప్పు దాడి జరిగింది. తమిళ అతివాది ఒకరు నారాయణన్ పై చెప్పువిసిరారు. శ్రీలంకకు చెందిన తమిళ శరణార్ధుల సంక్షేమంపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కార్యక్రమంలో భాగంగా నారాయణన్ ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రభాకరన్(35) అనే ఆందోళనకారుడు నారాయణన్ పై చెప్పు విసిరాడు. అయితే అదృష్టవశాతుతు ‘చెప్పు’ నారాయణన్ కు తాకలేదు. అయితే తనపై ‘చెప్పు’ విసిరిన వ్యక్తి వైపు చూసి నవ్వేసిన నారాయణన్, ఘటనను లైట్ తీస్కుని ప్రసంగిస్తూనే ఉన్నారట. వెనువెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు మాత్రం ప్రభాకరన్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాక నారాయణన్ భద్రతా సలహాదారుగానే కాదు,  పశ్చిమబెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ