నోటుకు ఓటు వ్యవహారంలో ప్రస్తుతం ఢిల్లీలో పెద్దలతో చర్చలు జరుపుతున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీ సీఎం కేసీఆర్ కు వార్నింగ్ ఇఛ్చారు. తనను అరెస్ట్ చేసినా, చెయ్యడానికి ప్రయత్నించినా, కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోతుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడు. ఢిల్లీలో ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ... ఆయనలా(కేసీఆర్) చెయ్యడానికి చూస్తే, అదే ఆయన ప్రభుత్వానికి ఆఖరి రోజు అని బాబు వ్యాఖ్యానించారు. ఆడియో టేపుల వ్యవహారంలో తానెందుకు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆయన నా సంభాషణలను రికార్డు చేసి ఉండొచ్చు, లేదా ఆయన చానెల్ చేసి ఉండోచ్చు. కాకుంటే సంభాషణలు సృష్టించి ఉండొచ్చు... ఈ విషయంలో నేనెందుకు సమాధానం చెప్పాలి?. అని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలంగా ఉండేందుకు తాను చెపట్టిన చర్యలను చూసి ఓర్వలేక తెలంగాణ ముఖ్యమంత్రి తనపై రాజకీయ దాడులు చేస్తున్నారని బాబు ఆరోపించారు. ‘‘మనం ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా మారాం. రెండూ తెలుగు ప్రజలవే. గతంలోనూ నేను చెప్పాను. మన తప్పని సరిగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఇరు రాష్ట్రాలనూ అభివృద్ధి పథంలోనూ నడిపించాలని, కానీ, కేసీఆర్ అందుకు సహకరించటం లేదు’’ అన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారికి మంత్రి పదవులు ఇచ్చింది కేసీఆరేనని ఆరోపించారు.