పిట్టకథలకి కాపీ రైట్స్ లేవు కదా!

January 05, 2016 | 02:17 PM | 1 Views
ప్రింట్ కామెంట్
chandra-babu-pitta-katha-at-tenali-janmabhoomi-niharonline

సభల్లో ఉపన్యాసాలు దంచే వారితోపాటు తమ తమ వాక్ చాతుర్యంతో జనాల్ని కట్టిపడేసి నేతలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో తన దగ్గర ఉన్న పిట్టకథలతో వారితోపాటు మీడియా వాళ్లని అవలీలగా కట్టిపడేస్తారు తెలంగాణ సీఎం కేసీఆర్. మీటింగ్ ఏదైనా రెగ్యులర్ నేతల్లా సొల్లు దంచకుండా పాయింట్ కి వచ్చి చెప్పాల్సిన మ్యాటర్ ను ఓ పిట్టకథ సాయంతో ఆసక్తికరంగా చెప్పటం ఆయన ఒకడికే సాధ్యం. అయితే అదే బాటలో ఇప్పుడు మరో తెలుగు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పయనిస్తున్నారు.

                          ఎవరు నిర్వహించాల్సిన బాధ్యతలను వారే నిర్వహించాలని గుర్తు చేస్తూ చంద్రబాబు చెప్పిన ఓ పిట్టకథ బాగా హైలెట్ అయ్యింది. తెనాలిలో ఏర్పాటు చేసిన జన్మభూమి సభలో బాబు మాట్లాడుతూ... "రోడ్డు మీద ఓ పక్షి పడుకొంది. తన కాళ్లను ఆకాశం వైపు చూపిస్తూ, అది వెల్లికిలా ఉంది. అదే దారిలో వెళుతున్న ఓ గుర్రం పక్షిని చూసి, ఎందుకు కాళ్లు పైకిఎత్తి పడుకున్నావు? అని ప్రశ్నించింది. దానికి సమాధానంగా ఆ పక్షి, ఆకాశం భూమి మీదకు పడిపోతోంది. దాన్ని ఆపడానికి నా కాళ్లను అడ్డుగా పెడుతున్నాను అని చెప్పిందట. దీంతో పగలబడి నవ్విన గుర్రం, నువ్వు ఆపితే ఆకాశం పడకుండా ఆగిపోతుందా? అని ప్రశ్నించగా, చిన్న కాళ్లే కదాని నేను చూస్తూ కూర్చుంటే ఎలా? ఎవరు అడ్డుకుంటారు? అని పక్షి చెప్పింది" అంటూ, ఎవరి పనిని వారు నెరవేర్చాలని, సమాజహితం కోసం అది తప్పనిసరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక అక్కడున్న జనాలందరి మొహంలో చిరునవ్వు, మరోవైపు అధికారులకు కూడా ఆయన చెప్పిన కథ బాగానే కనెక్ట్ అయ్యిందట. ఇలా చెప్పాలనుకున్న సీరియస్ విషయాన్ని సింపుల్ గా ఓ పిట్టకథను అడ్డంపెట్టుకుని చెప్పేశారయన.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ