ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతలు ‘మా తాతలు నేతులు నాకారు మా మూతులు వాసన చూడండి’ అనే స్టేజీకి ఎదిగారు. వారసత్వ పంథాలో పయనిస్తూ ఫ్యామిలీ డబ్బాలు కొట్టుకుంటూ రాజకీయాల్లో పబ్బం గడుపుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న యువతకు ప్రేరణగా నిలిచే వారు. వారిని ప్రేరేపించేవారు కరువయ్యారనే చెప్పాలి. కానీ, ఓ ధనిక కుటుంబం నుంచి వచ్చిన ఎంపీ గల్లా జయ దేవ్ మాత్రం చిన్నతనంలోనే తండ్రిపై ఆధారపడకుండా ఎలా నెట్టుకొచ్చాడో పరిస్థితులను వారికి విద్యార్థులకు వివరిస్తూ వారికి కాస్త ఇన్సిపిరేషన్ గా నిలిచే ప్రయత్నం చేశారు.
తాను అమెరికాలో పదేళ్ల వయసులో ఐదవ తరగతి చదువుతున్నప్పుడు పేపర్ బాయ్ గా పనిచేశానని, ఆపై ఓ దుస్తుల షాపులోనూ కొంతకాలం పాటు పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. పేద, ధనిక అనే విషయాన్ని పక్కన పెట్టండి. చదువుతో ఎంతటి ఉన్నత స్థానానికైనా వెళ్లవచ్చని, పేదరికం ఎంతమాత్రమూ చదువుకు అడ్డంకి కాదని చెప్పారు. నేటి తరంలో చిన్నారులు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకునే సరికి వారికోసం అమరావతి ప్రాంతంలో అపార ఉద్యోగావకాశాలు సిద్ధంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంతంలో పలు పాఠశాలల్లో కట్టించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించిన సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఇంటి పరిస్థితులు ఎలాగున్నా, మనోధైర్యంతో ముందడుగు వేసి అనుకున్నది సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ గోడును ఆయన ముందు వ్యక్తపరచగా, ఆయన అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.