ఆఫ్టర్ ఆల్ గంగిరెడ్డి!

November 16, 2015 | 03:01 PM | 1 Views
ప్రింట్ కామెంట్
AP_DGP_venkatramudu_gangi_reddy_niharonline

పోలీసన్నాక కూసింతన్నా జాలీకనికరం ఉండాలని ఎవరైనా నోరు జారితే చేతిలో ఉన్న లాఠీ, నెత్తిన టోపీ, ఎర్రబెల్టుతో సహా పగలబడి నవ్వుతాయ్! అది రూలు అంతే! గాంధీగారి చేతిలో ఉన్న ఊతకర్ర కూడా పోలీసోడి కంటికి లాఠీగానే కనబడుతుంది. ఇది ప్రకృతి ధర్మం.

ప్రపంచ దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులే టార్గెట్లు అయ్యారు. జైల్లో మేం ఏమి ప్రొటెక్షన్ ఇవ్వగలం? జైలే ఓ ప్రొటెక్షన్! అని ఆంధ్ర డీజీపీ జాస్తి వెంకట్రాముడు వేదాంత మిళిత సందేహాస్పద ప్రకటన ఒకటి విసరడం జరిగింది. ఎర్రచందన చోరుడు గంగిరెడ్డి విషయంలో; గతంలో క్షేమంగా ఉంటాడనే మొద్దుశీనుని చెరసాలలో పెట్టినప్పటికీ ఓంకార్ అనే అర్భకుడు గుండు పిక్కలా ఉండే మొద్దుశీనుని హరీమనిపించేడని కథనం! ఇక్కడ గంగిరెడ్డి సంపాదించిపెట్టుకున్న నేరతీవ్రత ఆషామాషీ కాదు. ఏకంగా ముఖ్యమంత్రిపైనే హత్యాయత్నం, హద్దులు మీరి, ఎల్లలు దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఎర్రబంగారం స్మగ్లింగు.

జాస్తివారి కామెంటుకి భవిష్యత్ లో జరగబోయే ఘటనలకూ ఏ విధమైన కార్యకరణ సంబంధం ఉండగలదో వేచిచూద్దాం!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ