అసలు పార్టీ ఉనికే లేని కాంగ్రెస్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం. ఫలితంగా టీడీపీ ప్రభుత్వం తరపు నుంచి కౌంటర్ లు పడటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామక్రుష్ణుడు అక్కడి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయితీల పేరిట ప్రభుత్వ సొమ్మునున పరిశ్రమలకు దోచిపెడుతున్నారన్న రఘువీరారెడ్డి వ్యాఖ్యలపై యనమల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దోచుకోవడం... దాచుకోవడం... కాంగ్రెస్, వైఎస్ జగన్ లకే చెల్లు’’ అని ఆయన అన్నారు. ‘‘ఊర కుక్కలు కరుస్తాయని ఊరు అవతల వదిలేసి వస్తాం. అలాగే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం అవతల పెట్టేశారు’’ అని కూడా ఆయన కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కనీసం ఓ రాజకీయ పక్షంగా కూడా తాము గుర్తించటం లేదని ఆయన అన్నారు.