ఒక్క అయిదు నిమిషాలు... దేనికోసం?

October 14, 2015 | 11:16 AM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-amaravathi-chiru-letter-niharonline

అధికారం కోల్పోయాక పార్టీ పతనం అధో:పాతాళంకి పడిపోయింది. కాంగ్రెస్ అంటే ఏ మాత్రం ప్రభావం లేని పార్టీగా దేశంలో మిగిలిపోయింది. మరి అలాంటి టైంలో వారి వినతులు కేంద్రం వింటుందా అన్నది సందేహమే.  కాంగ్రెస్ కు చేదు జ్నాపకాలను మిగిల్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్ అయిపోయిన నేతలు ఇప్పుడు హక్కుల కోసం తెరమీదకు వచ్చి పోరాడేందుకు సిద్ధమైపోతున్నారు.

విజయదశమి రోజున నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన రాయి పడనుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయానా హజరై ఈ మహత్తర కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా మోదీని కలవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలంతా నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీలంతా కలిసి మోదీకి ఓ ప్రత్యేక లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు తెలియజేసేందుకు వీలుగా తమకు ఐదు నిమిషాల పాటు అపాయింటుమెంట్ ఇవ్వాలని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు చిరంజీవి, కేవీపీ రాంచంద్రరావులు లేఖ రాశారు. వీరితో పాటు సుబ్బరామిరెడ్డి, జైరాం రమేశ్‌ తదితరులు సైతం ఈ లేఖపై సంతకాలు చేశారని జేడీ శీలం మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు, ప్రత్యేక హోదాపై అప్పటి ప్రభుత్వం చేసిన తీర్మానం అమలైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఆర్థిక వృద్ధిలో పయనించే అవకాశం వారంతా ఏర్పడుతుందని లేఖలో పేర్కొన్నారట.

పునర్వవ్యస్థీకరణ బిల్లును రూపొందించిన కాంగ్రెసే ఇప్పుడు అందులోని లోపాలను వాడుకుని ప్రయోజనం పొందాలని చూస్తుండగా, మరోవైపు చిరంజీవి లాంటి నేతలు మళ్లీ ప్రజల్లో సింపథీ కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా చిరంజీవితోపాటు పలువురు కాంగ్ నేతలు బీజేపీ కండువా కప్పుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీ పై అనుమానాలు నెలకొనటం సహజమే కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ