‘సిరా’క్షసులు-‘థా’క్రేజీదుండగులు

October 13, 2015 | 03:36 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sudheendra-kulkarni-shivasena-ink-attack-niharonline

దాయాది దేశపు మాజీ మంత్రి కసూరి విశ్రాంతంగా ఉండలేక పుస్తకించేరు. దానిపేరు డేగా కాదు శాంతికపోతమూ కాదు. దాని ఆవిష్కరణ ఢిల్లీలో సజావుగానే జరిగింది. కానీ, ముంబయిలో కరుడుగట్టిన భూమిపుత్ర భావజాలం మోతాదు మెండుగాగల శివసేన పార్టీ ఒకటి ఉంది. వారి తప్పులేకుండా ముందుగా, ఈ పుస్తకావిష్కరణ జరగనివ్వం అని హెచ్చరికలతో కూడిన వాగ్దానం చేశారు. ఎందుకొచ్చిన తంటా అని శివసేన అధ్యక్షుడు థాక్రేని ఆవిష్కరణ కార్యక్రమ బాధ్యుడు సుధీంద్ర కులకర్ణి కలిసి పేచీ పెట్టవద్దని కోరేరు.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మీకుంటే, పుస్తకావిష్కరణా హక్కు మాకూ ఉందని వాదనా పటిమను వెళ్లబుచ్చేడు. పర్యవసానంగా పులి బిడ్డ థాక్రే ఏవిధమైన హామీ ఇవ్వలేదు. తదనంతరం సుధీంద్ర తన ఇంట్లోంచి బయటకొచ్చిన తక్షణం పార్టీ పిల్ల కాయలు తగురీతిన స్పందించే ఉద్దేశ్యంతో చెడుమాటలు కూస్తూ, సిరా బాటిళ్లు తీసుకుని కులకర్ణి ముఖంపైనా, చొక్కాపైనా దట్టంగా ఒలకబోసేరు. ఆ మేకప్ తో అలానే మన సిరాజుద్దీన్ ప్రెస్ మీట్ కు అటెండయ్యారు. తెల్లగా ఉన్న రచయిత కసూరీ, నల్ల సిరా మేకప్పుతో కులకర్ణిగార్ల ఫోటోలు అన్ని పేపర్లలో వచ్చేయి. థాక్రేజీ గారి హుకుం మన్నించనంతమాత్రన మారీచ సుబాహులవలె అంత విలువైన సిరాతో శత్రువుని పులిమి పాకం పెడతారా? వృథా అయిపోయిన సిరాతో బోల్డెన్నీ బుక్స్ రాసుకుని ఉందును గదా అని కసూరీ భాయ్ దిగుల చెందుగాక!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ